యుద్ధం పరిష్కార మార్గం కాదు: పాక్ ప్రధాని

ఆదివారం, 2 ఆగస్టు 2009 (16:16 IST)
దీర్ఘకాలికంగా భారత్‌తో ఉన్న అన్ని రకాల వివాదాల పరిష్కారం కోసం తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలీనీ ప్రకటించారు. కాశ్మీర్ వివాదంతో పాటు.. ఇతర సమస్యలపై చర్చలకు తాము సిద్దమని తెలిపారు. వీటి పరిష్కారానికి యుద్ధం పరిష్కార మార్గం కాదని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం గిలానీ ఒక న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇరు దేశాల ప్రజల సమస్యలపై దృష్టి సారించాలంటే.. ముందు తమకున్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవరం ఎంతైనా ఉందన్నారు. సమానత్వంతో కూడిన చర్చలకు ఇస్లామాబాద్ ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఈ ఉప ఖండంలో ఉన్న 1.5 బిలియన్ ప్రజల కష్టాలపై దృష్టిసారించేందుకు ఈ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ ఉప ఖండంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, జీవన పరిస్థితుల రూపకల్పనకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడం వంటివి ఉన్నట్టు చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామా లేదా అనే విషయంపై ఆలోచన చేయడం లేదు. దేశంలో సుస్థిరతను ఎలా కాపాడలన్న అంశం గురించే తాము ఆలోచన చేస్తున్నట్టు గిలానీ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి