యూఎస్ఏఐడీ అధిపతిగా రాజీవ్ షా నియామకం

శుక్రవారం, 25 డిశెంబరు 2009 (12:22 IST)
భారత సంతతికి చెందిన రాజీవ్ షాను అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఏఐడీ) అధిపతిగా నియమిస్తూ అమెరికన్ సెనేట్ ఆమోదముద్ర వేసింది.

రాజీవ్ షా(36) ఒబామా పాలనాయంత్రాంగంలో అత్యున్నత పదవిని అధిరోహించిన భారతీయునిగా ఈ ఘనతను సాధించారు. క్రిస్మస్ పండుగ సెలవులకు ముందుగా ఈ బిల్లుపై సెనేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పదవికి దాదాపు 30కిపైగా నామినేషన్లు రాగా రాజీవ్ షాకే ఈ పదవి దక్కింది.

ప్రస్తుతం ఒబామా అనుసరిస్తున్న విదేశీ విధానంలో ఈ విధులు నిర్వహించే షా తన నివేదికలను ఎప్పటికప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌ను నివేదిస్తుంటారు. దీంతోపాటు ఆయన వ్యవసాయ పరిశోధన సంస్థ, ఆర్థిక పరిశోధన సంస్థ తదితరాలను పర్యవేక్షిస్తారని సెనేట్ ఆమోద ముద్ర వేసినట్లు సెనేట్ వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి