లేచిపోదామన్న ప్రియుడు... రానన్న నేపాలీ అమ్మాయి... పెట్రోలుతో నిప్పు

సోమవారం, 10 డిశెంబరు 2012 (14:38 IST)
FILE
నేపాలీ అమ్మాయిలపై ఇటీవలి కాలంలో అఘాయిత్యాలు పెగుతున్నట్లు కనబడుతోంది. తాజాగా మరో అమ్మాయి ప్రియుడి కోపాగ్నికి అగ్ని బారిన పడింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని బహారైచ్ గ్రామానికి చెందిన బాబు ఖాన్ అనే కుర్రాడు నేపాల్‌లోని బర్దియా జిల్లాలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు.

అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటబడటం మొదలెట్టాడు. ఓ రోజు తనతో కలసి పారిపోయి వచ్చేయాలంటూ ఆమెను వేధించాడు. అందుకు ఆ బాలిక నిరాకరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన పెట్రోలు పోసి నిప్పు అంటించాడు.

సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ఐతే దాదాపు తొంభై శాతం కాలిన గాయాలకు గురైన ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి