శ్రీలంకకు 2.6 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) శ్రీలంకకు 2.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆమోదించింది. శ్రీలంక ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఈ రుణాన్ని అందజేస్తోంది.

అంతేకాకుండా అంతర్యుద్ధం కారణంగా నష్టపోయిన ప్రజలకు పునరావాసం కల్పించడం, ఇతర సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా శ్రీలంక ప్రభుత్వం ఈ రుణాన్ని ఉపయోగించుకోనుంది.

ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం శ్రీలంకకు 2.6 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 322.2 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తోంది. ఈ నిధులు శ్రీలంకకు వెంటనే అందుబాటులోకి వస్తాయి. మిగిలిన రుణాన్ని త్రైమాసిక సమీక్షల సందర్భంగా దశలవారీగా విడుదల చేస్తారు.

వెబ్దునియా పై చదవండి