సరిహద్దు వద్ద స్వీట్లు: సాంబా సెక్టార్‌లో కాల్పుల మోత!
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద స్వీట్స్ పంచుకొన్న భారత్, పాకిస్థాన్ దళాలు జమ్ము, కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వేడుకలకు విఘాతం కలిగించాయి.
ముజాహిద్ రెజిమెంట్ కమాండెంట్ కల్నల్ ఉమర్ గుల్ నేతృత్వంలోని పాకిస్థాన్ అధికారులు కల్నల్ క్రిస్టోఫర్ సారధ్యంలోని భారత అధికారుల బృందాన్ని పూంఛ్ జిల్లాలోని ఛాకన్-ద-బాగ్ క్రాసింగ్ పాయింట్ వద్ద కలిసి భారత్ 65వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ అధికారులు స్వీట్స్, పండ్లు అందించగా భారత అధికారులు వారికి టీ, స్వీట్స్ అందచేశారు. అయితే పాకిస్థాన్ రేంజర్లు సాంబా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ భారత పోస్ట్‌పై కాల్పులు జరిపారు.