స్వైన్‌ఫ్లూ బారినపడి 8వందలమంది మృతి

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న మహమ్మారి స్వైన్‌ఫ్లూ వ్యాధిబారినపడినవారిలో దాదాపు ఎనిమిది వందలమంది మృత్యువాతపడ్డారు.

మెక్సికోలో ఈ ఏడాది మార్చ్ నెలలో మరియు అమెరికాలో ఏప్రిల్ నెలలో మహమ్మారిగా మారిన స్వైన్‌ఫ్లూ ఇన్ఫ్లూయెంజా-ఏ హెచ్1 ఎన్1 వ్యాపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వ్యాధిబారినపడినవారిలో దాదాపు ఎనిమిది వందల మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

వాతావరణంలోని మార్పులకారణంగా ఉత్తర ధృవంలో వైరస్ వేగవంతంగా వ్యాప్తి చెందింది. ఈ కారణంగానే స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని దీంతో ప్రపంచంలోని స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులలో దాదాపు 800మంది మృత్యుఒడిలోకి జారుకున్నారని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి గ్రెగరీ హార్టల్ తెలిపారు.

హార్టల్ జెనీవాలో మాట్లాడుతూ... ప్రపంచంలోనే దాదాపు 160 దేశాలలోని ప్రయోగశాలల్లో నివేదికలు అందాయని, రానున్న రోజులలో ఇంకా ఎంతమంది ఈ వ్యాధి బారినపడినవారు కోలుకుంటారోననేది అనుమానంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి