మిస్ యూఎస్ఏ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన తొలి మహిళా సైనికాధికారి దెషౌనా బార్బర్‌ను కొందరు ఆకతాయిలు... నువ్వు నల్లగా ఉన్నావని, కోతిలా అందవికారంగా ఉన్నావని అసభ్య సందేశాలు పంపుతున్నారు. దీనిపై ఆమె వాపోతోంది. ఇలాంటి హేళన తననెంతో బాధిస్తోందని, అయితే తను నల్లగా ఉన్నంత మాత్రాన అనాకారిని కానని ఘాటుగా సమాధానమిస్తోందీ భామ. నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్ అంతా ఇలాంటి సందేశాలను పట్టించుకోవద్దు అని తనకు ధైర్యం చెబుతున్నారని బార్బర్ తెలిపింది.
"నేను అమెరికన్‌ని. మిస్ యూఎస్ఏగా ఎంపికయ్యా..ఈ విధమైన కామెంట్స్‌కు ఏమాత్రం బెదిరిపోను అంటోంది". కిరీటం గెలుచుకున్న క్వీన్స్‌కు ఇలాంటి బెదిరింపులు, వల్గర్ మెసేజ్‌లు అందుతున్న వైనం వారినెంతగానో బాధిస్తుంది.