14 మంది మహిళలతో 22 మంది పిల్లలకు తండ్రి!

శనివారం, 8 జూన్ 2013 (10:35 IST)
File
FILE
అమెరికాలో 33 యేళ్ళ ఓర్లాండో షా చరిత్ర సృష్టించాడు. ఓర్లాండో షా అనే వ్యక్తి టెన్నిసీ (అమెరికా)లో ఛైల్డ్ సపోర్ట్ అధికారులకు దడ పుట్టిస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఇప్పటికే 14 మంది మహిళలతో సంబంధం పెట్టుకుని 22 మంది పిల్లలకు జన్మనివ్వడమే వారి భయానికి కారణం.

ఈ పిల్లల పోషణకు నెలకు 7 వేల డాలర్ల దాకా ఖర్చుచేస్తున్నాడట. ఓర్లాండో బాధను తాళలేక అమెరికాకు చెందిన చైల్డ్ సపోర్ట్ సర్వీసెస్ అధికారులు ఓర్లాండో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లుల తరపున పోషణ కోరుతూ నాష్‌విల్లే కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన మెజిస్ట్రేట్ స్కాట్ రోసెన్‌బర్గ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసు విచారణ పూర్తయితే ఓర్లాండోకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరైన ఓర్లాండో మీడియాతో స్పందిస్తూ నేను యువకుణ్ని, ఒక లక్ష్యం కలవాణ్ని. నేను మహిళలను ప్రేమిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఇప్పటి వరకు తనతో పడక సుఖం పంచుకున్న అమ్మాయిల లెక్క మాత్రం తనకు గుర్తు లేదని, 18 మందితో 17 మందిని కని ఉంటానని చెప్పుకొచ్చాడు. తన పిల్లలందరినీ ప్రేమిస్తానని, వాళ్లంతా తన 'షా' ఇంటి పేరును తరాల తరబడి నిలబెడతారని ఓర్లాండో చెప్పుకొచ్చాడు.

వెబ్దునియా పై చదవండి