తంతే బూర్లగంపలో పడ్డాడు అనేది తెలుగు సామెత. తన్నాల్సిన అవసరం లేకుండానే అమెరికాలో ఒక వ్యక్తి డబ్బుచెట్టుపై పోయి పడ్డాడు. కారణం బాహుబలి 2 వ్రపంచవ్యాప్త కలెక్షన్ల కంటే రెట్టింపు డబ్బు లాటరీ ద్వారా సొంతం కావడమే. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తిన్నా తరగనంత ఆస్తి అతడిని వరించింది మరి.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ వ్యక్తి లాటరీలో ఏకంగా రూ.2,888 కోట్లు (448 మిలియన్ డాలర్లు) గెలిచారు. ఇందులో నుంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేయనున్నారు.