న్యూజిలాండ్‌లో భూకంపం... 5 కి.మీ లోతులో భూకంప కేంద్రం గుర్తింపు!

సోమవారం, 4 మే 2015 (13:01 IST)
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భూకంపం... సోమవారం న్యూజిలాండ్‌ను వణికించింది. న్యూజిలాండ్‌కు సమీపంలో ఉండే వనాకా ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 
 
దేశ రాజధాని వెల్లింగ్టన్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప తీవ్రత భూకంప లేఖినిపై 6గా నమోదయింది. అయితే, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించ లేదని స్థానికులు ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు, అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. 

వెబ్దునియా పై చదవండి