ఇండోనేషియా మౌమెరికి సమీపంలో భారీ భూకంపం

మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:47 IST)
ఇండోనేషియా దేశం మరోమారు భూకంపతాడికి గురైంది. ఈ దేశంలోని మౌమెరికి 95 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలను జారీచేశారు.
 
అయితే, యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మాలజికల్ సెంటర్ మాత్రం ఈ భూకంప తీవ్రతను 7.7గా అంచనా వేసింది. మౌమెరికి 95 కిలోమీటర్ల దూరంలో, ఫ్లోరేస్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతులో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీచేసింది. అలాగే, అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను అలెర్ట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు