ఇదిలావుంటే, ఆరు నెలల నుంచి 15 యేళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికీ మీజిల్స్ టీకా వేయాల్సిందేనని మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జోహన్నస్ మారిసా వెల్లడించారు. ఈ మీజిల్స్ అనేది ఓ అంటు వ్యాధని తెలిపారు. దగ్గు, తుమ్ము, సన్నిహితంగా మెలగడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చెప్పారు.
ఈ వైరస్ సోకిన వారికి దగ్గు, తుమ్ము, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ముఖ్యంగా, పోషకార లోపంతో బాధపడే చిన్నారుల ఈ తట్టు వ్యాధి బారినపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.