డ్రామా థియేటర్‌పై రష్యా దాడి.. 300 మంది మృతి

శుక్రవారం, 25 మార్చి 2022 (19:49 IST)
ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియూపోల్‌లో ఆశ్రయం పొందుతున్న డ్రామా థియేటర్‌పై గత వారంలో రష్యా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 
 
డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. థియేటర్‌లో పౌరులు ఆశ్రయం పొందుతున్నారని రష్యాకు తెలుసునని, విచక్షణారహితంగా దాడిచేసి విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించింది.
 
రష్యా బాంబు దాడి సమయంలో డ్రామా థియేటర్‌లో 1,000 నుంచి 1200 మంది వరకు పౌరులు ఆశ్రయం పొందుతున్నారు. 
 
ఈ ఘటనలో ప్రాణనష్టంపై అప్పుడు అంచనాకు రాలేకపోయారు. పేలుడు ధాటికి థియేటర్‌ తీవ్రంగా ధ్వంసమైనట్లు బయటకు వచ్చిన ఫోటోలను బట్టి తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు