ట్రంప్ మద్దతుదారుడు తన సీట్లో కూర్చుని ముందు సీటుపై కాళ్లు పెట్టాడు. దీంతో, విస్తుపోయిన ముందు సీట్లోని ప్రయాణికుడు సహా మిగిలిన ప్రయాణికులు ఇవేమి పనులంటూ ప్రశ్నించారు. దీంతో సదరు ప్రయాణీకులపై ఫైర్ అయ్యాడు.
తాను కూర్చున్న వరుసలోని సీట్లన్నీ తనకు కావాలని పట్టుబట్టాడు. అందులో ఎవ్వరూ కూర్చునేందుకు వీల్లేదని గోల గోల చేశాడు. దీంతో విసిగిపోయిన మిగిలిన ప్రయాణీకులకు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు.. ట్రంప్ మద్దతుదారుడని.. ఆయన్ని విమానం నుంచి దించేశారు. ట్రంప్ మద్దతుదారుడు చేసిన హంగామాతో విమానం గమ్యం చేరేందుకు ఐదు గంటలపాటు ఆలస్యమైంది.