భూమికి పెనుముప్పు తప్పేలాలేదు. ఓ భారీ గ్రహశకలం భూమి వైపునకు దూసుకొస్తోంది. సైజులో అత్యంత భారీ పరిమాణంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, దాని వేగం కూడా ఇదివరకటి అస్టరాయిడ్లతో పోల్చుకుంటే.. రెట్టింపు ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది.
పరిమాణంలో భారీగా.. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్త 381 మీటర్లు. ఇది భూమి వైపు అసాధారణ వేగంతో దూసుకొస్తోంది. ఈ నెల 18వ తేదీన భూకక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ సైజు కంటే పెద్దగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈ బ్రిడ్జ్ పొడవు 2,737 మీటర్లు.