పాకిస్థాన్‌లోని హిందువుల పరిస్థితి అత్యంత దయనీయం : అమెరికా

ఆదివారం, 4 అక్టోబరు 2015 (17:14 IST)
పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే అంశంపై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు లొరెట్టా శాంజెస్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితి దారుణంగా ఉందని, విద్య, ఉద్యోగాల్లో హిందువులకు అన్యాయం జరుగుతోందన్నారు. 
 
హిందువులపై జరుగుతున్న దాడులను, మానవ హక్కుల ఉల్లంఘనలు యధేచ్చగా జరుగుతున్నాయనీ పేర్కొన్నారు. సింధ్ ప్రావిన్స్‌లో హిందువుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని మత హింస విపరీతంగా ప్రజ్వరిల్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా పాకిస్థాన్‌లోని మదర్సాల్లో కూడా మతవిద్వేషం నూరిపోస్తున్నారని శాంజెస్ ఆవేదన వ్యక్తం చేశారు. సింధి భాషను కూడా పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, హఫిజ్ సయీద్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాక్ ప్రభుత్వం తప్పుపని చేస్తోందని కాంగ్రెస్ సభ్యులు పలువురు అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి