ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేస్తున్నారు..అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా గురువారం నాడు మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు.
హీరో అనురూప్ రెడ్డి మాట్లాడుతూ.. బంధూక్, శేఖరం గారి అబ్బాయి అనే సినిమాలు చేశాను. నాకు ఇది మూడో చిత్రం. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశాం. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ప్రతీ తల్లిదండ్రులు వారి పిల్లలకు దగ్గరుండి మరీ చూపించే సినిమా అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందరూ ఆదరించాలి. శిరీన్ అన్న ఇంతకు ముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు. మూడేళ్లు కష్టపడి ఆయన ఈ మూవీని తీశారు. ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ సపోర్ట్ చేయండి అని అన్నారు.
నటి మానస మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చాను. నాకు ఈ చిత్రంలో మంచి కారెక్టర్‌ను ఇచ్చారు. మెచ్యూర్డ్ అమ్మాయి, కష్టాల్లో తోడు ఉండే స్నేహితురాలి పాత్రలో కనిపిస్తాను. మా చిత్రం జూన్ 7న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి అని అన్నారు.
సూపర్ వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. నేను సినిమాను చూశాను. శిరీన్ ఏడ్పించేశాడు. ఆయన సినిమాను తీయలేదు.. ఎమోషన్‌ను తీశాడు. స్టార్టింగ్‌లో ఓ తమిళ్ సినిమాలా అనిపించింది. తెలుగులో ఆ తమిళ్ ఫ్లేవర్‌ను నేచురల్‌గా తీశాడు. ఒక్కో పాత్ర అద్భుతంగా ఉంటుంది. కారెక్టర్ నేమ్స్‌తోనే ఆర్టిస్టులు గుర్తుండిపోతారు. అనురూప్ అద్భుతంగా నటించారు. ప్రతీ ఒక్క ఫీమేల్ కారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. థియేటర్లో ఈ సినిమాను అందరూ చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ మూవీ నచ్చుతుంది. మన జీవితాల్లోంచే ఈ పాత్రలు వచ్చినట్టుగా కనిపిస్తాయి. మూడు గంటల పాటు కంటి రెప్ప వేయకుండా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు చూపించేదే కాదు.. ప్రతీ పిల్లవాడు తల్లిదండ్రులకు చూపించే చిత్రంగా ఉంటుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. జూన్ 7న మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.
నటీనటులు: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు