సంపూర్ణ సూర్యగ్రహణం- ఆకాశంలో అద్భుతం రింగ్ ఆఫ్ ఫైర్..

శుక్రవారం, 13 అక్టోబరు 2023 (20:34 IST)
Ring of Fire
సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడబోతోంది. ఈ సంపూర్ణ సూర్య గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే "రింగ్ ఆఫ్ ఫైర్" ఆకాశంలో ఆవిష్కృతం కాబోతోంది. శనివారం మధ్యాహ్నం 4:30 గంటలకు అంతరిక్షంలో సంభవించే అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 
 
ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనుంది. ఈసారి సూర్యగ్రహణం భారత్ సహా అనేక దేశాల్లో కనిపించడం లేదు. 
 
సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ దేశాల్లో 'రింగ్ ఆఫ్ ఫైర్' 2012లో కనిపించగా, మళ్లీ ఇప్పుడే కనిపించనుంది. ఇలాంటి గ్రహణం మళ్లీ 2046లోనే ఏర్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు