2017లో డిలీట్ ఫర్ ఎవిరీవన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఏడు నిమిషాల వ్యవధి మాత్రమే ఉండేది. అంటే పంపిన మెసేజ్‌లను ఆ సమయంలోపు డిలీట్ చేయాల్సి వచ్చేది. 2018లో ఈ సమయాన్ని 4,096 సెకన్లకు అంటే గంటా 8 నిమిషాల 16 సెకన్లకు పెంచింది.
అయితే, ఇప్పుడు దానిని కూడా తొలగించి, ఎప్పుడైనా డిలీట్ చేసుకునే వెసులుబాటును తీసుకొస్తోంది. ఫలితంగా కొన్ని నెలల తర్వాత కూడా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చు.
దీంతో పాటు స్టిక్కర్ సజెషన్ ఫీచర్‌పైనా పనిచేస్తోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రమ్, ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి షేర్ అయ్యే వీడియోల కోసం వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ను ఐవోఎస్ యూజర్లకు తీసుకొస్తోంది.