బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుదలకు అదే కారణం

బుధవారం, 27 అక్టోబరు 2021 (12:22 IST)
చైనా, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా, బ్రిటన్‌లో కొత్త కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం 'ఏవై.4.2' వేరియంటే కారణమని భావిస్తున్నారు. 
 
ఈ వేరియంట్‌ను డెల్టా ప్లస్‌గా పిలుస్తున్నారు. ఇది డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. బ్రిటన్‌ ఆరోగ్య భద్రతా సంస్థ ఇటీవలే దీనిని వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌గా పేర్కొన్నది. 
 
భారత్‌లోనూ ఏవై.4.2 రకం కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో ఈ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. అయితే ఏవై.4.2 వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ, ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు