ఇంటర్వ్యూలు లేకుండానే అమెరికా వీసాలు...

ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (20:05 IST)
ఇంటర్వ్యూలు లేకుండానే అమెరికా వీసాలు పొందేందుకు ఓ మంచి అవకాశం లభించింది. ఈ యేడాది డిసెంబరు 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. అదికూడా కొన్ని నిర్ధిష్ట కేటగిరీలకే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. అలాగే, కరోనా సమయంలో వీసా రుసుంను చెల్లించిన వారికి గడుపు పొడగించారు. 
 
ఈ మేరకు అమెరికా కాన్సులేట్ అధికారులు ఆదేశాలు జారీచేశారు. బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రే ఇది వర్తిస్తుంది. అది కూడా వచ్చే డిసెంబరు 31వ తేదీనాటికల్లా దరఖాస్తు చేసుకున్నవారికే వర్తిస్తుందని స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం భారతీయులకు జారీ చేస్తున్న వీసాలలో ఎఫ్, హెచ్1, హెచ్3, హెచ్4, నానా బ్లాంకెట్ ఎల్, ఎం, ఓ, పీ, క్యూ, అకడమిక్ జే వీసాలను ఇంటర్వ్యూ లేకుండానే జారీ చేయనున్నట్టు అమెరికా తెలిపింది. అలాగే, ఇప్పటికే విసా గడువు ముగిసిన వారు, గడువు ముగిసిన తర్వాత 48 నెలల్లోపు రెవెన్యువల్ చేయించుకుంటే ఇంటర్వ్యూ లేకుండానే ప్రక్రియ ముగించనున్నట్టు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు