రాజకీయ నేతల్లో అతి తక్కువు మంది మాత్రమే నైతిక విలువలకు కట్టుబడివుంటారు. అంతరాత్మ ప్రభోదం మేరకు నడుచుకుంటారు. విధులు నిర్వహిస్తుంటారు. అయితే, పోర్చుగల్ దేశంలో గర్భంతో ఉన్న భారతీయ పర్యాటకురాలు విపత్కర పరిస్థితుల్లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ పర్యాటక మంత్రి ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆ మంత్రి పేరు మార్టా టెమిడో.
ఈ వివరాలను పరిశీలిస్తే, లిస్టన్‌లోని ప్రధాన ఆస్పత్రి శాంటియా మారియాలో నియోనాటాలజీ విభాగం కరోనా సమయంలో కిక్కిరిసిపోయింది. దీంతో 34 యేళ్ళ భారతీయ గర్భిణీని ఆస్పత్రిలో చేర్చేందుకు అంబులెన్స్‌లో పలు చోట్ల తిప్పారు.
మరోవైపు, ఈ పర్యాటకురాలి మృతిపై పోర్చుగల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో కరోనా సమయంలో ఆస్పత్రులోని ప్రసూతి విభాగాలు కూడా పూర్తిగా నిండిపోవడంతో గర్భిణిలు కూడా గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది.