అర్జెంటీనా వీపీకి ఆరేళ్ల జైలు శిక్ష.. ఎందుకో తెలుసా?
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (11:44 IST)
Cristina Fernández
అవినీతి కేసులో అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్‌కు 6 సంవత్సరాల జైలు శిక్ష పడింది. క్రిస్టినా ఫెర్నాండెజ్ 2007 నుండి 2015 వరకు అర్జెంటీనా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 నుంచి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు.
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
దీనికి సంబంధించి ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో విచారణ జరుపుతున్న సమయంలో క్రిస్టినా దీనిని ఖండించారు.
ఈ కేసులో తుది విచారణ గురువారం కోర్టులో జరిగింది. ఇందులో క్రిస్టినాకు 6 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. దీంతో క్రిస్టినా మద్దతుదారుల్లో కలవరం మొదలైంది.