కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది మృతి?

గురువారం, 15 డిశెంబరు 2022 (18:38 IST)
Cango
ఆఫ్రికాలోని కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది చనిపోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన కాంగో రాజధాని కిన్షాసాలో సోమవారం రాత్రి నుంచి మరుసటి రోజు మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణంలోకి వరద నీరు వచ్చి చేరింది. 
 
ఇందులో బ్రిడ్జిలు, రోడ్లు, వాహనాలు వరదలో మునిగిపోగా కార్లు ఇతరత్రా వాహనాలు, జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. అనంతరం అక్కడ కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
ఫలితంగా చాలా ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. 141 మంది మరణించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యల్లో కాస్త జాప్యం జరిగినా సైన్యం సహకారంతో  వరద బాధితులను రక్షించే పనులు కొనసాగుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు