ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా సియాంజుర్ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద చిక్కుకునిపోయిన వారిని సహాయక బృందాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భూకంపం ప్రభావం కారణంగా ఇండోనేషియా రాజధాని జగర్తాలో సముద్ర అలలు ఎగిసెగిసి పడుతున్నాయి.