యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం... 62 మంది చిన్నారులు బలి..!

బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:14 IST)
యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా అభంశుభం తెలియని 62 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ) ప్రకటించింది. గత కొన్ని రోజులుగా యెమెన్లో సుస్థిర పాలనకు భంగం వాటిల్లి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
 
ఆ కారణంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిసెఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘యెమెన్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా విద్య, ఆరోగ్య సంస్థల సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రజలు బాంబు దాడుల భయంతో వణికిపోతున్నారు.

ఘర్షణలు, దాడులు, ఆహారలేమి, భయాందోళనల కారణంగా 62 మంది చిన్నారులు మృతి చెందగా, 30 మంది చిన్నారులు గాయపడ్డారు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా యెమెన్‌లో ఉన్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు కేంద్రం ఒక విమానం రెండు ఓడలను పంపిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి