అది మేకపిల్ల కాదు.. రాక్షసి :: భయంతో పరుగులు తీసిన జనం! (Video)

సోమవారం, 24 జులై 2017 (10:52 IST)
అది మేకపిల్ల కాదు.. రాక్షసి అంటూ భయంతో జనం పరుగులు తీశారు. ఈ ఘటన అర్జెంటీనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అర్జెంటీనాలోని శాన్‌లూయిస్‌లో రాక్షస రూపంతో మేకపిల్ల జన్మించింది. ఈ మేకపిల్ల కళ్లు ఊహకందని విధంగా లోపలకు కుచించుకుపోయి ఉన్నాయి. అంతేకాదు, దాని మొహం మేక మొహంలాకాకుండా, ఓ రాక్షసుడిని తలపించేలా ఉంది. 
 
ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, భయానికి గురవుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే, మేకపిల్ల మొహం మాత్రమే వికృతంగా ఉందని, మిగిలిన భాగమంతా మామూలుగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేకపిల్ల ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

వెబ్దునియా పై చదవండి