ఇదిలా ఉంటే.. మల్దీవులకు చెందిన పర్యాటక మంత్రిత్వశాఖ కూడా సోమవారం కీలక ప్రకటన చేసింది. భారతదేశం నుంచి మాల్దీవులకు వచ్చే పర్యాటకులు జనావాస ద్వీపాల్లోని పర్యటక కేంద్రాల్లో ఉండటాన్ని నిషేధిస్తున్నాం. ఈ ఆదేశాలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.