కానీ బంగ్లాలో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో దాదాపు 11 మంది హిందువులను గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హత్య చేశారు. గత ఏడాది నుంచి మొదలైన హింసలో లౌకికవాద రచయితలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణాలకు కారణం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలతో మైనారిటీలు బిక్కుబిక్కుమంటున్నారు.
గతంలో ధనవంతులైన హిందువులపై దాడులు, అమ్మాయిలపై అత్యాచారాలు జరిగితే.. ప్రస్తుతం నిరుపేదలైన సాధారణ హిందువులను కూడా హత్య చేస్తున్నట్లు బంగ్లాదేశ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ దాడులు ఐఎస్ చర్య అనేది తెలియాల్సి వుందని చెప్తున్నారు. మరి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి హిందువులపై జరిగే హింసకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.