ముఖ్యంగా.. పుతిన్ ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చేపట్టే చర్యలపై తమకు ఎప్పుడూ నమ్మకం లేదని... కానీ, అమెరికన్లు ఆయనకు మద్దతు ఇస్తుండటం, తనకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ఆ అమెరికన్లు మరెవరో కాదని... రిపబ్లికన్లు అని చెప్పారు. ఇతర దేశాల అధినేతలపై ఆధారపడటం అమెరికా భవిష్యత్తుకు మంచిది కాదని సూచించారు. డెమొక్రాటిక్ పార్టీ నేతల కంటే పుతిన్ నే ట్రంప్ ఎక్కువగా విశ్వసిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా పుతిన్ ప్రచారం చేయించారని మండిపడ్డారు.