దక్షిణ కొరియాకు ఏమైంది.. కమలా హ్యారిస్ పర్యటన.. క్షిపణి ప్రయోగం అవసరమా?

సోమవారం, 26 సెప్టెంబరు 2022 (11:06 IST)
దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా సిద్ధమైంది. ఇప్పటికే అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ మరికొద్ది రోజుల్లో దక్షిణ కొరియాను సందర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
సరిగ్గా ఇదే సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సహజ శైలిలో అమెరికా, దక్షిణ కొరియాలను రెచ్చగొట్టే చర్యకు పాల్పడ్డారు. టైకాన్‌ ప్రాంతం నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా.. ఈ క్షిపణి 60 కిలో మీటర్ల ఎత్తులో 600 కిలో మీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిపోయింది. 
 
ఆదివారం ఉదయం ఉత్తర కొరియా తూర్పు తీరంలో సముద్రం వైపు ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర ప్యోంగ్యాన్ ప్రావిన్స్‌లోని టెచోన్ ప్రాంతం నుంచి దీనిని ప్రయోగించారని తెలిపింది.
 
కాగా.. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పర్యటన, దక్షిణ కొరియా, అమెరికా దళాలు సంయుక్తంగా సైనిక కసరత్తులు చేయాల్సిన సమయంలో ఈ క్షిపణి ప్రయోగంపై అమెరికా మండిపడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు