సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ

డీవీ

మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (16:49 IST)
Superstar Rajinikanth Coolie look
జైలర్ మ్యాసీవ్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన 'LCU' తో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేతులు కలిపారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం #Thalaivar171 పవర్ ప్యాక్డ్ టీజర్ ద్వారా టైటిల్ రివీల్ చేశారు
 
ఈ చిత్రానికి 'కూలీ' అని పేరు పెట్టారు, టీజర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను స్టైలిష్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. అతను గోల్డ్ స్మగ్లర్ల డెన్ లోకి ప్రవేశిస్తాడు. బంగారు గడియారాలతో చేసిన గొలుసుతో వారిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ ముఠా బాస్‌ని ఫోన్‌ లో వార్నింగ్ ఇస్తాడు.  .
 
సూపర్‌స్టార్‌కి ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ ఇంట్రడక్షన్. కూలీ పూర్తి యాక్షన్‌తో నిండిపోతుందని, రజనీకాంత్ తన వింటేజ్ అవతార్‌లో కనిపిస్తారని టీజర్ హామీ ఇచ్చింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది.
 
2025లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు