అంతిమ విజయానికి ఒక్క అడుగు దూరంలో బైడెన్!

గురువారం, 5 నవంబరు 2020 (08:58 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా, బుధవారం చేపట్టిన ఓట్ల లెక్కింపు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మాత్రం విజయం సాధించినట్టు ప్రకటించారు. అందరం కలిసి ఈ విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. మనం విజయానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్నాం. ప్రతి ఒక్కరిపైనా, ఎన్నికల ప్రక్రియపైనా నమ్మకం ఉంచాం. అందరం కలిసి ఈ విజయాన్ని సాధించాం అంటూ ట్వీట్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. " అని వ్యాఖ్యానించారు.ఈ ట్వీట్ వైరల్ అయింది.
 
దీనికి రిప్లయ్ లు ఇస్తూ, ఎంతో మంది ట్వీట్లు పెట్టారు. ట్రంప్ మద్దతుదారులు ఏడుస్తుంటే చూసేందుకు ఆనందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇక, గడచిన 28 ఏళ్లుగా జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థురాలు కమలా హారిస్ మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
 
ఇక మరికొందరైతే, వైట్‌హౌస్ ముందు ఓ ట్రక్ నిలిచివుండగా, దానిలోకి సామాన్లు ఎక్కిస్తున్న పాత వీడియోలను పోస్ట్ చేస్తూ, ట్రంప్ సామాన్లు సర్దేసుకుంటున్నారంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. 
 
కాగా, బైడెన్ తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెడుతూ, ప్రతి ఓటునూ లెక్కించాలని కోరారు. ఓట్లను లెక్కించేది తానో లేదా ట్రంపో కాదని, తదుపరి అధ్యక్షుడిని నిర్ణయించి, తమ అభిప్రాయాన్ని నిక్షిప్తం చేసింది ప్రజలేనని గుర్తు చేశారు.

కాగా, ఈ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలంట 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సివుంది. ప్రస్తుతం జో బైడెన్ ఖాతాలో 264 ఓట్లు ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు 214 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ఆరు ఓట్లు సాధిస్తే శ్వేతసౌథం తదుపరి అధ్యక్షుడుగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు