భర్తను హత్య చేసి.. మర్మాంగాన్ని కోసేసింది.. ఆపై పెనంపై వేసి ఫ్రై చేసింది..!

గురువారం, 10 జూన్ 2021 (16:28 IST)
భర్తను హత్య చేసిన మహిళ దారుణానికి పాల్పడింది. బ్రెజిల్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసేసింది. అంతేకాదు కోసేసిన మర్మాంగాన్ని వంటలో ఉపయోగించింది. ఈ దారుణానికి పాల్పడిన 33 ఏళ్ల మచాడోను ఈ నెల 7 అరెస్ట్ చేశారు పోలీసులు. మృతుడు సాంటా కేటరినా ఇంట్లోనే నగ్నంగా, విగతజీవిగా పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు.
 
వివరాల్లోకి వెళితే మచాడో, తన భర్త సాంటా కేటరినా మర్మాంగాన్ని కోసేసిన పెనం మీద నూనెలో వేసి వేయించింది. ఉదయం నాలుగు గంటల సమయంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. విడిపోయే విషయంలో జరిగిన గొడవ కారణంగానే మచాడో.. భర్తపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని తెలిపారు. 
 
పోలీసులు నిందితురాలు మృతుడిపై దాడి చేసేందుకు ఉపయోగించిన వంటగది కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్యతో పాటు బాధితుడిని వేధింపులకు గురి చేసిన ఆరోపణల కారణంగా మచాడోను పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల పాటు కలిసి ఉన్న మచాడో, సాంటా కేటరినా రెండేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటికీ వీరిద్దరూ ఒకరినొకరు చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి 8 ఏళ్ల కొడుకుతో పాటు 5 ఏళ్ల కూతురు ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు