18 నెలల వ్యవధిలో 42 కుక్కలపై అత్యాచారం.. శిక్ష ఎప్పుడంటే?

గురువారం, 28 సెప్టెంబరు 2023 (14:46 IST)
బ్రిటన్‌కు చెందిన జంతు శాస్త్రవేత్త ఆడమ్ బ్రిటన్ 18 నెలల వ్యవధిలో 42 కుక్కలపై అత్యాచారం చేశాడని.. మూగ జీవాలను హింసకు గురిచేశాడనే షాకింగ్ ఘటన సంచలనానికి దారితీసింది. బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్‌లతో కలిసి పనిచేసిన జంతుశాస్త్రవేత్త ఆడమ్ బ్రిటన్.. డజన్ల కొద్దీ కుక్కలను చనిపోయే వరకు హింసించినట్టు ఆస్ట్రేలియా కోర్టుకు వెల్లడించాడు. అతడి క్రూరత్వానికి సంబంధించిన ఆధారాలన్నీ కెమెరాలో ఉన్నాయి. 
 
ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు సహా 60 ఆరోపణలలో తన నేరాలను అంగీకరించిన దోషికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు. కేసు విచారణ సందర్భంగా హాలులో ఉన్నవారిని బయటకు వెళ్లిపోవాలని నార్తర్న్ టెరిటరీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూచించారు. 
 
ఆ వివరాలు తెలిస్తే షాక్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున కోర్టు గది నుంచి ప్రజలను బయటకు వెళ్లమని హెచ్చరించారని స్థానిక మీడియా పేర్కొంది. కుక్కలపై అత్యాచారం చేస్తున్న వీడియో బయటపడటంతో నార్తర్న్ టెరిటరీ పోలీసులు 2022లో అతడ్ని అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారణ కావడంతో అతడికి డిసెంబర్‌లో శిక్ష ఖరారు కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు