డెవిల్ నుంచి వచ్చిన మాయ చేశావే సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించింది. డెవిల్ సినిమా 1940లోని మదరాసి ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకున్నారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను చిత్రీకరించారు.
ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలను ఈ పాటలో వాడారు. వీటి వాడకంతోనే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లారు.