స్టంట్ల ద్వారా చారిటీ కోసం నిధులు సేకరిస్తున్న సాహసికుడు టామ్ మోర్గాన్.. వంద హీలియమ్ బెలూన్స్‌తో 8వేల అడుగుల పైకి ఎగిరాడు. రంగురంగుల బెలూన్లు వంద సేకరించి అందులో హీలియం నింపి అన్నింటినీ జోడించి వాటి సాయంతో ఏకంగా విమానం ఎగిరేంత ఎత్తులో ఎగిరాడు. దాదాపు ఎనిమిది వేల అడుగుల పైకి ఎగిరాడు. దక్షిణాఫ్రికా గగనతలంపై ఈ సాహసకృత్యం నిర్వహించాడు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సంట్ల ద్వారా చారిటీ కోసం నిధులు సేకరిస్తున్న మోర్గాన్ బెలూన్స్ ఫీట్ ద్వారా రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్ అనంతరం మోర్గాన్ మాట్లాడుతూ.. హీలియం నింపిన బెలూన్లతో అంత ఎత్తుకు ఎగరడం తనకే షాక్ నిచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ సాహస కృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.