కోవ్యాగ్జిన్‌కు కెనడా గుర్తింపు - ప్రయాణికులకు ఊరట

ఆదివారం, 21 నవంబరు 2021 (13:49 IST)
ఇది భారత్ నుంచి కెనడా వెళ్లే ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించేవార్త. ఆ దేశ ప్రభుత్వం కోవ్యాగ్జిన్ టీకాకు గుర్తింపునిచ్చింది. దీంతో ఈ వ్యాక్సిన్ వేయించుకున్నవారంతా కెనడా దేశానికి వెళ్లొచ్చు. అయితే, ఈ వ్యాక్సిన్‌కు గుర్తింపు ఈ నెలాఖరు నుంచి లభించనుంది. 
 
కాగా, ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే గుర్తింపునివ్వగా, ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇపుడు కెనడా ప్రభుత్వం సమ్మతం తెలిపింది. 
 
కోవ్యాగ్జిన్‌తో పాటు సినోఫార్మ్ (కొవిలో), సిఓవాక్ (కరోనావాక్) వ్యాక్సిన్లకు కూడా కెనడా సర్కారు ఓకే చెప్పింది. అంతేకాకుండా, ఇప్పటికే రెండో కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకున్నవారు లేదా మిశ్రమ వ్యాక్సిన్లు వేసుకున్నవారి కెనడా దేశంలో పర్యటించవచ్చని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు