షేక్ హసీనా హత్యకు కుట్ర : 14 మంది మిలిటెంట్లకు ఉరి

బుధవారం, 24 మార్చి 2021 (12:22 IST)
బంగ్లాదేశ్ దేశ షేక్ హసీనా హత్యకు కుట్ర చేసిన కేసులో 14 మంది మిలిటెంట్లకు కోర్టు మరణశిక్షను విధించింది. ఈ కేసు 20 యేళ్ళ క్రితం నాటి కేసు. హసీనా హత్యకు  కుట్ర చేసి, దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై విచారించిన కోర్టు, 14 మందికి మరణశిక్షను విధించింది. 
 
వీరంతా ఇస్లామిక్ మిలిటెంట్లేనని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొత్తం 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారంతా ఇప్పటికీ పరారీలో ఉన్నారు.
 
1975 నుంచి హసీనా పలుమార్లు హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నారు. తాజా కేసులో వీరందరినీ ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్చి చంపాలని లేదా ఉరి తీయాలని న్యాయమూర్తి ఆదేశించారు. 
 
ఈ తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. హర్కతుల్ జీహాద్ బంగ్లాదేశ్ కు చెందిన వీరంతా 2000 సంవత్సరంలో హసీనా హత్యకు కుట్ర చేశారన్నది ప్రధాన అభియోగం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు