టర్కీ మరోమారు బాంబు పేలుళ్ళతో ఉలిక్కిపడింది. టర్కీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలు ఉన్న కారు ఢీ కొట్టడంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. క్యాసేరిలోని ఎరసైయెస్ యూనివర్సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సైనికులను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ కారు బాంబు దాడికి పాల్పడినట్లు టర్కీ ఉప ప్రధాని వెసి క్యానక్ తెలిపారు. కాగా, గతవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.