అతడు సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. ఆ బాలుడి తండ్రి కరోనా వైరస్ బారిన పడ్డాడనే అనుమానంతో స్థానిక అధికారులు అతణ్ని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ పిల్లాడికి అన్నం పెట్టేవాడు లేకపోయాడు. దీనితో ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ బాలుడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను చైనా ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది.