ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 400 మంది శ్వాసకోస ఇబ్బందులతో బాధపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా మెడికల్ రిలీఫ్ గ్రూప్ పేర్కొంది.
దీంతో స్పందించిన సిరియా రసాయన దాడి వార్త అవాస్తవమని, తాము రసాయన ఆయుధాలను ఉపయోగించలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఉపయోగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.