డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ బ్లెండ్ చేసే ప్రత్యేకమైన కథాంశంతో విభిన్నంగా ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఇప్పటికే ఖరారు కావడంతో, టీం ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై అంతటా రెక్కీ చేస్తున్నారు. మొదటి షూటింగ్ షెడ్యూల్ కోసం సరైన లొకేషన్ల కోసం వెతుకుతున్నారు.