భూటాన్, చైనా మధ్య సరిహద్దు వివాదం.. చర్చలు జరుగుతాయా?
ఆదివారం, 15 జనవరి 2023 (13:20 IST)
భూటాన్, చైనా మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడంతో అధికార స్థాయిలో చర్చలు జరిపి సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
చైనా-భూటాన్ సరిహద్దు సమస్యలపై నిపుణుల బృందం 11వ సమావేశం నవంబర్ 10 నుంచి 13 వరకు చైనాలోని కున్మింగ్‌లో జరిగింది. ఈ మేరకు ఇరు దేశాలు నిన్న సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
11వ ఎక్స్ పర్ట్ గ్రూప్ సమావేశంలో పారదర్శక, సుహృద్భావ, నిర్మాణాత్మక వాతావరణంలో చైనా-భూటాన్ సరిహద్దు చర్చలను వేగవంతం చేసేందుకు ఎంవోయూ అమలుపై లోతైన అభిప్రాయాల మార్పిడి జరిగింది. అలాగే ఏకాభిప్రాయం కుదిరింది.