పాంగోంగ్ సరస్సు వద్ద రెండు వంతెనలు నిర్మించిన చైనా

శనివారం, 21 మే 2022 (09:39 IST)
భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైన చైనా దేశం దురాక్రమణ చర్యలకు పాల్పడుతుంది. చైనా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. పాంగోంగ్ త్సో సరస్సు వద్ద రెండు వంతెనలు నిర్మించింది. ఇందులో ఒక వంతెన నిర్మాణం పూర్తికాగా, మరో వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై విపక్షాలు గగ్గోలు పెడుతుండటంతో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. 
 
తూర్పు లఢఖ్ ప్రాంతంలోని పాంగోంగ్ త్సో సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మిస్తున్నది నిజమేనని వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చైనా ఓ వంతెన నిర్మించిందని, ఇపుడు దాని పక్కనే మరో వంతెన నిర్మాణం చేపట్టిందని వివరించింది. 
 
ఆక్రమించుకున్న భూభాగాల్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోందని, ఇలాంటివాటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా చేసే అర్థరహితమైన ఆరోపణలను తాము అంగీకరించబోమని ఉద్ఘాటించింది. 
 
ప్రస్తుతం ఎప్పటికపుడు తాజా పరిణామాలు గమినిస్తూనే ఉంటుందని, భారతదేశ భద్రతకు భంగం వాటిల్లే పరిస్థితులు ఉపేక్షించేది లేదని తగిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ సాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్జి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు