మరోవైపు, హెనన్ ప్రావిన్స్‌లో గత వెయ్యేండ్లలో లేనంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ప్రావిన్స్ రాజధాని జెంగ్‌జౌలో మంగళవారం ఒక్కరోజే 45.7 సెంటీమీటర్ల వాన పడింది. ప్రావిన్స్‌లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భీకర వరదలు సంభవించాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. కార్లు కాగితపు పడవల్లా వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా 25 మంది చనిపోయారు. ఏడుగురు గల్లంతయ్యారు.
సహాయకార్యక్రమాల కోసం సైన్యం రంగంలోకి దిగింది. ఈ భారీ వర్షాల ప్రభావం 12.4 లక్షల మందిపై పడింది. ఇప్పటివరకు 1.60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రవాణా నిలిచిపోయింది. 250కి పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. యిచువాన్ కౌంటీలో భారీ వరద నీటిని దారి మళ్లించడానికి సైన్యం ఓ పాడుబడిన డ్యామ్‌ను పేల్చేసింది.