పిల్లలు, పెద్దలు వయస్సుతో సంబంధం లేకుండా ఈ గేమ్‌ను ఆడే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. దీంతో ఈ గేమ్‌ను నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ దశాల్లో పిల్లల్ని బాగా ఆకట్టుకుంటున్న.. మొబైల్ గేమ్ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తున్న 'పోకెమాన్ గో'కు అనుమతి ఇవ్వబోమని చైనా ప్రకటించింది.
భద్రతా కారణాల రీత్యా.. తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటే.. ఈ గేమ్‌ను నిషేధించడమే ఉత్తమ మార్గమని వెబ్ సైట్లో సంస్థ వెల్లడించింది. ''మొబైల్ ఫోన్లలో ఈ ఆట ఆడేవాళ్లు నిషేధిత ప్రదేశాల్లోకి ప్రవేశించడం, ట్రాఫిక్ సమస్యకు కారణమవ్వడం, ప్రమాదాలకు గురవడం తదితర సంఘటనలు కలవరపరుస్తున్నాయి.