కరెన్సీతోనూ కరోనా ముప్పు.. చైనా అప్రమత్తం.. నోట్లను ఆపేసింది..

ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (12:46 IST)
కరెన్సీతోనూ కరోనా ముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరించడంతో చైనా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరెన్సీ నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని, నోట్లను తాత్కాలికంగా నిల్వ చేయాలని ఆదేశించింది. 
 
ఒకరి చేతుల నుంచి మరొకరి చేతుల్లోకి కరెన్సీ నోట్లు మారటం ద్వారా కొవిడ్ అనే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. దీంతో  అప్రమత్తమైన సర్కారు నోట్లను తాత్కాలికంగా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇందులో భాగంగా చైనా పీపుల్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఫ్యాన్ యెఫై వివరణ ఇస్తూ, ఇప్పటికే హుబెయ్ ప్రావిన్స్ కు 4 బిలియన్ యువాన్ల కొత్త నోట్లను సరఫరా చేశామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్రభుత్వ బ్యాంకుల్లో నుంచి నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని నిర్ణయించామని తెలిపారు. 
 
ముఖ్యంగా బ్యాంకులు, మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను నిల్వ ఉంచి, వాటిని యూవీ కిరణాల ద్వారా శుభ్రపరిచిన తరువాతే చెలామణిలోకి పంపుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను మరింతగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు