కాగా.. టిబెట్-జింజియాంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిన చైనా ఇంజనీర్లు ప్రభుత్వానికి మార్చిలోనే అందజేశారని సమాచారం. అప్పట్లో ఖర్చుకు వెనకాడి వెనక్కి తగ్గిన చైనా.. ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే ఈ ప్రాజెక్టును తప్పకుండా నిర్మించి తీరాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాజెక్టును నిర్మించే అవకాశాలున్నాయని చైనా ప్రభుత్వాధికారుల సమాచారం.