కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చైనా - అమెరికా దేశాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఇరు దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. తాజాగా, హ్యూస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని అమెరికా మూసివేయించింది.
దీనికి ప్రతీకారంగా అమెరికాపై చైనా చర్యలకు దిగింది. చెంగ్డూలోని అమెరికా రాయబార కార్యాలయ నిర్వహణకు ఉన్న అనుమతిని ఉపసంహరిస్తూ ఆ విషయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసింది. అంతేకాదు, ఈ నిర్ణయం వెనకున్న కారణాన్ని కూడా వివరించింది.